భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లాలో ఆదివారం కురిసిన అకాల వర్షం అన్నదాతను నిండా ముంచేసింది. సాయంత్రం వేళ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం, వడగండ్ల వాన పడటంతో వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయారు.  మండలంలోని శంశిరెడ్డిపల్లి తండాలో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట పూర్తిగా నేలకొరిగింది. మూడు నెలల పాటు రేయింబవళ్లు కష్టపడి, అప్పులు చేసి సాగుచేసిన పంట వడగండ్ల వానకు దెబ్బతింది. గింజలన్నీ నేలరాలి, కంకులు పొలంలోనే రాలిపోవడంతో పెట్టుబడి కూడా దక్కని దుస్థితి…