భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి ఉమ్మడి మండలంలో రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తున్నామని మండల వ్యవసాయ అధికారి ఝాన్సీ తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని పలు ఎరువుల షాపులను ఆమె వెల్దుర్తి ఇన్చార్జ్ తహసిల్దార్ శ్రీనివాస్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల షాపులలో నిలువలు, పలు రికార్డులను తనిఖీ చేశారు. ఉమ్మడి మండల వ్యాప్తంగా ఇప్పటివరకు 16 వేల 800 బస్తాల యూరియా సరఫరా చేశామని పేర్కొన్నారు. రైతులు ఆన్లైన్ బుకింగ్ ద్వారానే యూరియా…