భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: గుమ్మడిదల మున్సిపల్ కార్యాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, అమ్మవారి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. అహింస, శాంతి, ధర్మ మార్గంలో నడిచిన వాసవి మాత ఆశయాలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శప్రాయమని కొనియాడారు. లోక కల్యాణం కోసం, ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన త్యాగం…