భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: హైదరాబాద్‌లోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి వెంకన్న గుజ్జ డాక్టరేట్ (పీహెచ్‌డీ)కు అర్హత సాధించారు. సంభావ్య చికిత్సా ఏజెంట్లుగా నూతన ట్రయాజోల్, ఆక్సాడియాజోల్ హెటెరోసైక్లిక్ ఉత్పన్నాలపై ఆయన తన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.
అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. శివకుమార్ మార్గదర్శకత్వంలో జరిగిన ఈ పరిశోధనలు ఎస్. న్యుమోనియాకు వ్యతిరేకంగా అద్భుతమైన యాంటీ బాక్టీరియల్ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్టు తెలిపారు. శక్తివంతమైన టోపోయిసోమెరేస్-II నిరోధక కార్యకలాపాలను చూపించడం ద్వారా, ఈ అధ్యయనాలు …





