భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని సాహితీ గ్యాస్ ఏజెన్సీలో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లైస్ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గృహ అవసరాలకు వినియోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను గోదాం నుంచి సరఫరా చేయకుండా, ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సదరు ఏజెన్సీపై కేసు నమోదు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ తెలిపారు.

వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సాహితీ గ్యాస్ ఏజెన్సీ నిర్వహణను…