భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్: ముప్కాల్ మండల కేంద్రంలో కల్లుబట్టీ ధరల వివాదం ముదిరింది. గత మూడేళ్లుగా కల్లు సీసాను రూ.10కి అమ్ముతుండగా, ధర గిట్టుబాటు కావడం లేదని గౌడ కులస్తులు రూ.15కి పెంచాలని గ్రామస్థులను కోరారు. దీనికి గ్రామస్థులు అంగీకరించకపోవడంతో నెల రోజులుగా కల్లుబట్టీలు మూతపడ్డాయి.
ఈ నేపథ్యంలో, ఎక్సైజ్ సీఐ అంజిత్ రావు రూ.15కే అమ్మాలంటూ గ్రామస్థులపై ఒత్తిడి తీసుకురావడంతో, సీఐ వైఖరికి వ్యతిరేకంగా ముప్కాల్ గ్రామస్థులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. గౌడ కులస్తులకు మద్దతుగా సీఐ వ్యవహరించడంపై గ్రామస్థులు ఆగ్రహం…





