భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు మంగళంపల్లి హుస్సేన్‌, హ్యూమన్ రైట్స్ నేతలు సోమవారం డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్‌‌ను హైదరాబాద్‌లోని యాప్రాల్ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పేద ప్రజల ఆశాజ్యోతి, సమాజ హితం కోసం డాక్టర్ వివేక్ నిరంతరం శ్రమిస్తున్నారని, వారు చేపడుతున్న వినూత్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. బాధితులకు అండగా నిలవడంలో, మానవ హక్కుల పరిరక్షణలో డిఎస్ఎఫ్ఐ పోషిస్తున్న పాత్రను ఆయన ప్రశంసించారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేస్తామని…