భారత్ సమాచార్.నెట్, మెదక్: తపాలా శాఖ ద్వారా నూతనంగా నమోదైన ప్రతి ఓటరుకు గుర్తింపు కార్డులను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, సహాయ ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త ఓటర్లకు కార్డుల పంపిణీ వేగవంతం చేయాలని తెలిపారు. ముఖ్యంగా, 100 సంవత్సరాల వయసు కలిగిన ఓటర్లను గుర్తించి, వారి వయసు ఆధారాలను…