భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు మైనర్లపై అఘాయిత్యాలకు ఒడిగడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు, మైనర్లకు రక్షణ లేకుండా పోయిందని కేంద్ర మంత్రుల స్థాయి వారి కొడుకులే అమ్మాయిల మీద అఘాయిత్యాలకు పాల్పడుతుంటే ఇక మామూలు మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని అన్నారు. మంత్రి కుమారుడైన బండి భగీరథ్‌ను వెంటనే అదుపులోకి…