భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వ గుర్తింపునకు చెందిన ఈ-శ్రమ్ కార్డును అర్హులైన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఎంపీడీవో బండారి పార్థసారధి పేర్కొన్నారు. ఇనుగుర్తి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం హక్ దర్శక్ సంస్థ ఆధ్వర్యంలో ఈ- శ్రమ్ కార్డులు నమోదు ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. అసంఘటిత రంగ కార్మికులకు సంబంధిత కార్డుల ద్వారా మేలు జరుగుతుందని తెలిపారు. 18 నుంచి 59 సంవత్సరాలు కలిగిన వారందరూ కార్డులు పొందాలని సూచించారు. రూ.2 లక్షల ప్రమాద బీమా ఉంటుందన్నారు.…
ఈ-శ్రమ్ కార్డులను కలిగి ఉండాలి: ఎంపీడీవో





