భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: యూరియాను బుకింగ్ యాప్ ద్వారా విక్రయం కోసం, రైతులకు వాలంటీర్లుగా సహకరించాలని నెల్లికుదురు మండలం ఇంచార్జ్, ఇనుగుర్తి ఏవో భూక్య మహేందర్ యువతకు పిలుపునిచ్చారు. నెల్లికుదురు రైతు వేదికలో ఆదివారం నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాల ఎరువుల షాపు డీలర్లకు, వ్యవసాయ అధికారులకు ఉమ్మడిగా ఎరువుల బుకింగ్ యాప్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయశాఖ ఆదేశానుసారం సోమవారం నుంచి జిల్లాలో యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఎరువుల అమ్మకాలు చేపట్టాలని దానికనుగుణంగా అన్ని…