September 4, 2026 11:14 am

Email : bharathsamachar123@gmail.com

ఇంటికి తాళం వేసి ఊరెళ్తున్నారా.. ప్రచార రథాన్ని ప్రారంభించిన సీఐ

భారత్ సమాచార్, సంగారెడ్డి:  ఇంటికి తాళం వేసి ఊరు వెళితే పోలీసులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని  జోగిపేట సీఐ అనీల్ కుమార్ అన్నారు. శుక్రవారం పోలీసు స్టేషన్ లో పోలీసు ప్రచార రథాన్ని ప్రారంభించారు. ప్రజల్లో అవగాహనను పెంచేందుకు ప్రచార రథాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దసరా పండుగకు స్వంత గ్రామాలకు వేళ్లాలనుకునే వారు వారి అడ్రస్, ఫోన్‌ నంబర్‌ను పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చినట్లయితే పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ఇంటి తాళాలను పూలకుండీలలో, డొర్‌ మ్యాట్స్‌ కింద, షూ రాక్స్‌లలో వేయకూడదని తెలిపారు. ఇంటిలోని బంగారం, వెండి వస్తువులు మీ వెంటే తీసుకేళ్లాలన్నారు. ఇంటికి సెంట్రల్‌ లాకింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకొవాలన్నారు. ఇంటికి సీసీ కెమోరాలను ఏర్పాటు చేసుకుంటే, కెమోరాను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు చూస్తుండాలన్నారు. మీ కాలనీలో అనుమానిత వ్యక్తులు సంచరించినట్లయితే 100 నంబర్‌కు ఫోన్‌ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ పాండు, ఎఎస్‌ఐ అంజయ్య, హెడ్‌ కానిస్టేబుల్‌ వేణుగోపాల్‌రావుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని కథనాలు:

సంగారెడ్డి గర్ల్స్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాలు

Share This Post