భారత్ సమాచార్, మేడ్చల్ జిల్లా: మాల్కాజిగిరిలో పండుగ పూట దారుణ ఘటన చోటు చేసుకుంది. నేరేడ్‌మెట్ పీఎస్ పరిధిలోని సాయినగర్‌కు చెందిన శ్రీనివాస్ గత కొద్ది రోజులుగా మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. నెల క్రితం హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత తల్లిదండ్రులు అతడిని ఇంటికి తీసుకొచ్చారు. మెంటల్ ఆసుపత్రిలో చేర్చారనే కోపంతో ఆదివారం అర్థరాత్రి తల్లిదండ్రులను దారుణంగా హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Share This Post














