September 4, 2026 11:09 am

Email : bharathsamachar123@gmail.com

మూడు రోజులపాటు నీటి సరఫరా నిలిపివేత

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: నర్సాపూర్ ప్రధాన పైప్‌లైన్ మరమ్మతుల పనులు జరుగుతున్న నేపథ్యంలో రానున్న మూడు రోజులపాటు మంజీరా నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా నర్సాపూర్, శివంపేట, కౌడిపల్లి, కొల్చారం, వెల్దుర్తి మండలాల్లోని గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ మూడు రోజులు స్థానిక ప్రజలు స్థానిక బోరులను ఉపయోగించుకోవాలని సూచించారు అధికారులు.

Share This Post