భారత్ సమాచార్.నెట్, సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని కేసారం రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగిన దారుణ హత్య సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ నర్సింహా శనివారం ఉదయం అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆధారాలు, సాక్ష్యాలు త్వరగా సేకరించి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డీఎస్పీ, సీఐలకు ఆదేశాలిచ్చారు. హంతకులను పట్టుకోవడానికి ఇప్పటికే మూడు ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉంచి, ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్ స్పెక్టర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు
Share This Post
















