భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిలిపిచేడ్ మండల సమైక్య కార్యాలయంలో వివోఏల సమీక్ష సమావేశానికి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సిహెచ్ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ మండలములో ఉన్న మహిళా సంఘాలకి అవసరానికి అనుగుణంగా రావాల్సిన రుణాలని బ్యాంకు ద్వారా ఇప్పించడంలో ఎదుర్కొంటున్న సమస్యలపై కూలంకషంగా చర్చించడం జరిగింది. వాటికి శాశ్వత సమస్య దిశగా పరిష్కారం నిర్దేశించడం జరిగింది. గ్రామం వారీగా వివోఏ లను సంఘం వారీగా రుణ వితరణ గురించి సమీక్షించడం జరిగింది.
అంతేకాకుండా మండలంలోని 387 సంఘాలలో ఉన్న 4045 మంది సభ్యురాలు తమ ఇంటి వద్ద లేదా పొలం వద్ద ఒక బహువార్షిక మొక్కని పెంచి మూడు సంవత్సరాలు పోషణ చేసి సమాజానికి అంకితం ఇవ్వాలనీ, నా మొక్క నా బాధ్యత అనే కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని వివోఏ లకి మార్గం నిర్దేశకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారితోపాటు ఏపీఎం మార్గం గౌరిశంకర్ సీసీలు పురుషోత్తం, వెంకటలక్ష్మి, శ్రీకాంత్, విజయలక్ష్మి, లక్ష్మణ్, అకౌంటెంట్ మానస, వివోఏలు సరిత, రేణుక, వీరమని, మాధవి, రమణి, మహేశ్వరి, మంగ, మంజుల, బాగయ్య పాల్గొన్నారు.

















