September 4, 2026 11:11 am

Email : bharathsamachar123@gmail.com

కూష్మాండ అలంకారంలో అమ్మవారు

భారత్ సమాచార్, రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం ఏడవ రోజు కూష్మాండ అలంకారంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండే అర్చకులు అమ్మవారికి వేదమంత్రోచ్ఛరణల మధ్య అభిషేకం, సతీసమేత పూజ, పరివార దేవతలకు అభిషేకాలు, గాయత్రి హవనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారిని భక్తులు దర్శించుకుని, మొక్కలు చెల్లించుకున్నారు.

Share This Post