September 4, 2026 11:11 am

Email : bharathsamachar123@gmail.com

న్యూడ్ కాల్స్ చేయాలంటూ.. ఒంటరి మహిళకు సీఐ వేధింపులు..

భారత్ స‌మాచార్.నెట్, నంద్యాల : జిల్లా పోలీస్ విభాగంలో సంచలనం సృష్టించిన సంఘటన ఇది. నంద్యాల జిల్లాకు చెందిన సీఐ కంబగిరి రాముడు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ ఒంటరి మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తనను ‘న్యూడ్ కాల్స్’ చేయాలని డిమాండ్ చేయడంతో పాటు, “నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను, నీ పిల్లలను బాగా చూసుకుంటాను, ఖాళీగా ఉంటే పోలీస్‌ స్టేషన్‌ వద్దకు రా” అంటూ సీఐ మెసేజ్‌లు పంపాడని బాధితురాలు మీడియాకు తెలిపింది.

 

ఈ మెసేజ్‌లకు అంగీకరించకపోవడంతో సీఐ తనను, తన పిల్లలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తానంటూ బెదిరింపులకు దిగినట్లు బాధితురాలు ఆరోపించింది. సాధారణ పౌరులకు న్యాయం అందించాల్సిన పోలీస్ అధికారి, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తనకు న్యాయం జరగకుంటే హోంమంత్రిని కలుస్తానని బాధితురాలు హెచ్చరించింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

 

మ‌రిన్ని క‌థ‌నాలు :

 

ఆళ్లగడ్డ ఆర్‌అండ్‌బీ ఏఈ అరెస్ట్

Share This Post