September 4, 2026 11:09 am

Email : bharathsamachar123@gmail.com

పురాతన బురుజు కూలడంతో రూ. 2లక్షల ఆస్తి నష్టం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా:వెల్దుర్తి మండలం మంగలపర్తి గ్రామంలో గత మూడు రోజుల నుండి కురిసిన వర్షానికి శనివారం పురాతన కాలంలో నిర్మించినటువంటి బూర్జు కుప్పకూలడంతో బురుజు పక్కన ఉన్నటువంటి పెంకుటిన్లపై పడింది. సత్యనారాయణ నరసింహులు కు సంబంధించినటువంటి పెంకుటిల్లపై పడడంతో ఎటువంటి ప్రాణాపాయ సంఘటన జరగలేదని ఉంచు కూలడంతో బాధితుల ఇల్లు సుమారుగా రెండు లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలియజేశారు. వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సంబంధిత బాధిత కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఇద్దరి చిన్నారులు బయటపడ్డారని బాధితులు తెలియజేశారు. గ్రామంలోని ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని గ్రామ ప్రజలు అధికారులకు నాయకులకు తెలియజేస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. ఇకముందు ఇటువంటి సంఘటనలు పునరామృతం కాకుండా తగిన జాగ్రత్తలు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Share This Post