భారత్ సమాచార్, సంగారెడ్డి: దివంగత మాజీ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి చార్ల మాణయ్య ఐదో వర్ధంతి శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గం హత్ముర కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి మాణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చార్ల మాణయ్య రాజకీయ సేవలను స్మరించుకుంటూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీలకు మాతృదేవోభవ కిట్స్ అందజేశారు.

మరిన్ని కథనాలు:
Share This Post













